NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రహదారి ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదు

1 min read

జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వాహనాలు ప్రయాణించకుండా నిఘా పెట్టాలి

హెల్మెట్, సీటుబెల్ట్  ధారణ, రహదారి భద్రత నియమాలపై అవగాహన కలిగించాలి

రహదారి ప్రమాదరహిత జిల్లాగా ఏలూరు జిల్లాను రూపొందించాలి

జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ తో కలిసి సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రహదారి ప్రమాదాల కారణంగా జిల్లాలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా జాతీయ రహదారి వెంట గట్టి నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో మంగళవారం జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది.హెల్మెట్స్, సీట్ బెల్ట్ లు అసౌకర్యంగా భావించకుండా వాహనాలు నడిపే  ప్రతీ ఒక్కరూ ధరించేలా అవగాహన కలిగించాలన్నారు.   జాతీయ రహదారిపై  ఎటువంటి అక్రమాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి భద్రతా సమావేశాలు ప్రతీ నెల నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారి వెంట గ్రామ సరిహద్దు ప్రాంతాలలో వీధి దీపాలు ఉండేలా చూడాలన్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ హైవే పై రోడ్డు డిజైన్ లోపం కారణంగా కొన్ని ప్రాంతాలలో వాహనాలు కంట్రోల్ తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని సరిచేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని  హైవే అధికారులను ఆదేశించారు.  జాతీయ రహదారిపై వాహనాలు పార్కింగ్ చేయకుండా ఎన్ హెచ్ పెట్రోలింగ్ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులకు మొదటి గంట(గోల్డెన్ అవర్)లో చికిత్స అందితే ప్రాణాపాయం తప్పించవచ్చని, జాతీయ రహదారికి చెందిన అంబులెన్స్ లు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.  సమావేశంలో  రవాణా శాఖ ఉప కమీషనర్ కృష్ణారావు,ఆర్టీవో శేఖర్, ఆర్ అండ్ బి ఎస్ ఈ రాజారత్నం, ట్రాన్స్కో ఎస్ఈ సాల్మన్ రాజు,జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నాo, డిఇఓ ఎం. వెంకట లక్ష్మమ్మ, డిసిహెచ్ఎస్ డా:పాల్ సతీష్ కుమార్,జాతీయ రహదారుల సంస్థ అధికారులు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author