ఏలూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా కర్రీ శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నిక
1 min read

ఎమ్మెల్యే బడేటి,మేయర్ నూర్జహాన్ పెదబాబు పుష్పగుచo అందించి శుభాకాంక్షలు
కార్పొరేటర్ కర్రీ శ్రీనివాస్ ని అభినందించిన కార్పొరేటర్లు, అభిమానులు,మిత్రులు శ్రేయోభిలాషులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం డిప్యూటీ మేయర్ పదవికి ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆశీస్సులతో 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావుకు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ పరంగా కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని నగరపాలక సంస్థ కార్యాలయం మేయర్ చాంబర్లో జరిగిన కార్యక్రమంలో కర్రీ శ్రీనివాసరావును డిప్యూటీ మేయర్ గా నిర్ణయిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రకారం త్వరలో ప్రక్రియ పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఏ.భాను ప్రతాప్ ను ఆదేశించినట్లు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య,నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే,మేయర్ కర్రి శ్రీనివాసరావుకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కర్రీ శ్రీనివాసరావు అభిమానులు, పలువురు కార్పొరేటర్లు,మహిళలు పాల్గొని ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

