నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 129వ జయంతి వేడుకలు
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిరం లో సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్బంగా ప్రభంధకారిణి సభ్యులు వై. పార్థసారథి చిత్ర పటానికి మాల వేసి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధానాచార్యులు కె. పార్వతి , సీనియర్ ఆచార్యులు వాసు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కథక్ లో1897వ సంవత్సరంలో జన్మించారు.ఈయన తల్లి తండ్రులు జానకి నాథ్ బోస్, ప్రభావతి దేవి లకు జన్మించారు. ఈయన బిరుదు నేతాజీ. ఈయన మీ రక్తాన్ని నాకివ్వండి స్వాత్రంత్రాన్ని ధారపోస్తాను అన్నారు.ఈయన తండ్రి గొప్ప న్యాయవాది అధిక ధనవంతుడు. ఈయన సివిల్స్ పరీక్ష రాసి అందులో నాల్గవ స్థానం సాధించారు. ఈయన మరణించారన్నా వార్త ఇప్పటికి భారతదేశానికి తెలీదు. భారత దేశ ప్రజలు ఈయన ఇంకా జీవించి ఉన్నారని అనుకుంటున్నారు.ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


