NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలు అధైర్యానికి లోను కావొద్దు 

1 min read

మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కార్యకర్తలకు పిలుపు                                                         

పత్తికొండ, న్యూస్ ​నేడు:  స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు  ఎలాంటి అధైర్యానికి తావివ్వకుండా, ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లి పోరాడాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక గోపాల్ ప్లాజాలో వైఎస్ఆర్సిపి నియోజకవర్గస్థాయి సంస్థ గత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలే తమ బలం అని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కిందిస్థాయి కార్యకర్తల దేనని అన్నారు. ఈ సమావేశానికి రీజినల్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, కర్నూల్ జిల్లా పార్లమెంటు పరిశీలకులు మాజీ ఎంపీ బుట్టా రేణుక, వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, రాష్ట్ర సీఈసి సభ్యులు ఎస్. రామచంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణం కార్యకర్తలేనని, వారి త్యాగాలు, పోరాటాలే పార్టీకి అసలైన మూలధనమని వారు పేర్కొన్నారు. ప్రతి బూత్‌లో పార్టీ బలోపేతానికి ప్రణాళికబద్ధంగా పని చేయాలని,ఇంటింటా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పార్టీని ప్రజల మధ్య మరింత బలంగా తీసుకెళ్లాలని వారు సూచించారు.అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు.

About Author