NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జి రాంజీ పథకం వద్దు… గాంధీ ఉపాధి చట్టం ముద్దు

1 min read

సిఐటియు వినూత్న రీతిలో కరపత్రాలతో ప్రచారం

పత్తికొండ, న్యూస్​ నేడు: మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి జి రాంజీ పేరుతో ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం నాడు పత్తికొండలో సిఐటియు కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. జి రాంజీ పథకం మాకు వద్దు గ్రామీణ హామీ పథకం మాకు ముద్దని వినూత్న రీతిలో సిఐటియు మండల కార్యదర్శి రవిచంద్ర ఆధ్వర్యంలో స్థానిక పత్తికొండ పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. పత్తికొండ పట్టణంలోని 18, 19 వార్డు కుమ్మరి వీధి లక్ష్మీ టాకీస్ వెనక ఉన్న కాలనీలలో సిఐటియు ఆధ్వర్యంలో ఉపాధి కూలీలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర సిపిఎం మండల కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు దస్తగిరి మాట్లాడుతూ, 2005 సంవత్సరంలో వామపక్షాల కృషి వల్ల ఎన్నో ఉద్యమాల వల్ల వచ్చిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ముజువాని ఓటుతో వి బి జి రాంజీ గా మార్చడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం వలన గ్రామీణ ప్రాంతంలో వలసల నివారణ సాధ్యపడుతుందని అన్నారు. గ్రామీణ ఉపాధి చట్టం వలన గ్రామీణ  కేంద్ర ప్రభుత్వంపై పడుతున్న భారాన్ని తగ్గించుకొని, రాష్ట్రాలపై 40% భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్ముందు ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేయాలన్న దురుద్దేశంతోనే మోడీ ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని అన్నారు. మోడీ తీసుకొస్తున్న ఈ చట్టాన్ని రద్దుచేసి ఇప్పటికే ఉన్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా ఉంచాలని కోరారు. ఈ మేరకు ఫిబ్రవరి 12న సిఐటియు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిందని తెలిపారు. దేశవ్యాప్త సమ్మెలో వ్యవసాయ కార్మికులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు.

About Author