NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలికలు ఉన్నత చదువులను అధిరోహించాలి

1 min read

ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం

మిడుతూరు, న్యూస్​ నేడు:  బాలికలు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మిడుతూరు ఎంపీడీవో పి దశరథ రామయ్య అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం జాతీయ బాలికల దినోత్సవాన్ని అంగన్వాడి సూపర్వైజర్లు బి.వరలక్ష్మి,పి రేణుకా దేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పిన విధంగా మంచిగా చదువుకోవాలని మీకు ఏమైనా సందేహాలు ఉంటే టీచర్లను అడగాలని బాలికలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉన్నారని తహసిల్దార్ అన్నారు. ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్త గురించిడాక్టర్ సుజాత బాలికలకు వివరించారు.తర్వాత బాలిక దినోత్సవం సందర్భంగా సూపర్వైజర్లు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

About Author