NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీఎన్జీఓస్​ ..తీర్మానాలు ఏకగ్రీవం..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు : ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు వి.జవహర్‌ లాల్ అధ్యక్షతన స్థానిక ఎన్జీవో హోం నందు జరిగినది. ఈ సమావేశమునకు కర్నూలు జిల్లాలోని అన్ని తాలూకాల అధ్యక్ష, కార్యదర్శులు మరియు జిల్లా ఆఫీస్ బేరర్స్ హాజరైనారు.  సమావేశంలో భాగంగా.. ఫిబ్రవరిలో జరగబోయే రాష్ట్ర సంఘం ఎన్నికలలో రాష్ట్ర అధ్యక్షులుగా కామ్రేడ్ విద్యాసాగర్ గారిని మరియు ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ డివి రమణ గారిని మరియు అసోసియేట్ అధ్యక్షులుగా దస్తగిరి రెడ్డి గారిని, వీరి ప్యానెల్ కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించడమయినది.  రాష్ట్ర సంఘం ఆదేశాల ప్రకారం ప్రతి తాలుకా కార్యవర్గం రాబోయే కాలంలో ఉద్యోగ సమాచారం మాస పత్రిక సభ్యత్వ నమోదు కార్యక్రమం భారీగా నమోదు చేయవలసిందిగా తీర్మానించడమయినది. కర్నూలు జిల్లా ఎన్జీవో హోంనకు మరమ్మతులు చేయించి రాబోయే కాలంలో అందరికీ ఉపయోగపడేలా ఎన్జీవో హోం ను తీర్చిదిద్దుటకు తీర్మానించడమైనది.  కోడుమూరు తాలూకా  ఎన్జీవో హోం కొరకు స్థల సేకరణ భాగంలో భాగంగా జిల్లా కలెక్టర్ కు ఒక మెమోరాండం సమర్పించుటకు తీర్మానించారు.   కర్నూలు జిల్లాలోని అన్ని తాలూకాల ఎన్నికలు మరియు జిల్లా సంఘం ఎన్నికలు సజావుగా జరుపుటకు, జరిపించినందులకు రాష్ట్ర సంఘం అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ గారికి, ప్రధాన కార్యదర్శి డి వి రమణ గారికి జిల్లా కార్యవర్గం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించడమైనది.  త్వరలో అన్ని తాలూకాలలో మరియు జిల్లాలో మహిళా విభాగం ఎన్జీవో  అసోసియేషన్ ఏర్పాటు చేయవలసినదిగా తీర్మానించడమయినది.   ఆలూరు తాలూకాలోని సంఘం యొక్క స్థలంలో వీలైనంత త్వరలో భవనము నిర్మిoచుటకు ఏర్పాట్లు చేయవలసినదిగా తీర్మానించడమయినది.  కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సి కాశన్న, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఈశ్వరయ్య, జిల్లా కోశాధికారి నాయుడు, ఉపాధ్యక్షులు సాంబ శివారెడ్డి, క్రిష్ణ మోహన్‌ మరియు జిల్లా కార్యవర్గము పాల్గొన్నారు.

About Author