భారత స్వాతంత్ర ముస్లిం సమరయోధుల అడుగుజాడల్లో నడుద్దాం…
1 min read

మహమ్మదీయ సల్ఫియా లిల్ బనాత్ మదరసాలో భారత స్వాతంత్ర ముస్లిం సమరయోధుల చిత్రాల ప్రదర్శన
హోళగుంద న్యూస్ నేడు: 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలతో దేశ ఐక్యతకు సందేశం..భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాత్మా గాంధీ, డా. బీఆర్ అంబేద్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ, దేశ స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసే కార్యక్రమం ఈరోజు అత్యంత ఘనంగా నిర్వహించబడింది.ఈ స్మరణ కార్యక్రమం మదర్సా మొహమ్మదియా సల్ఫియా ఆధ్వర్యంలో, సల్ఫియా ఎడ్యుకేషనల్ & వెల్ఫేర్ సొసైటీ, హోళగుంద కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ నిర్వహణలో విజయవంతంగా జరిగింది.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోళగుంద ఎస్సై దిలీప్ కుమార్ గురజాల,టీడీపీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి అబ్దుల్ సుబాన్,రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాతా కార్యదర్శి ఆదం,మండల మైనార్టీ నాయకులు మోయిన్,షాలి.అమాన్,జమియతే అహలే హదీస్ అధ్యక్షుడు ఎం సాదిక్,ఉపాధ్యక్షుడు ముల్లా,వలి,హమీద్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ..ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రలు, ఫోటోలు, వారి త్యాగాలను ప్రతిబింబించే విధంగా ప్రత్యేక ఫ్రీడమ్ ఫైటర్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ప్రజలు, విద్యార్థులు, యువత ఎంతో ఆసక్తితో తిలకించారు.పెద్ద ఎత్తున ప్రజలు, యువకులు, మేధావులు, నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దేశభక్తి నినాదాలు, జాతీయ గీతాల మధ్య కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.చివరగా, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మదర్సా మొహమ్మదియా సల్ఫియా మరియు సల్ఫియా ఎడ్యుకేషనల్ & వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు,ప్రజలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

