NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్డీవో కార్యాలయంలో ఘనంగా వేడుకలు

1 min read

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఆర్డిఓ డి నాగజ్యోతి ఆధ్వర్యంలో 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.సోమవారం ఉదయం కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఆర్డీవో ఎగురవేశారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాట యోధులు ఎన్నో పోరాటాలు నిరాహార దీక్షలు కష్టార్జిత ఫలితంగానే గణతంత్ర వేడుకలను నిర్వహిస్తున్నామని స్వాతంత్ర్య సమరయోధుల సేవలను గురించి వివరించారు.తర్వాత విద్యార్థులకు బహుమతులను ఆర్డీవో అందజేశారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ పరిపాలన అధికారి శ్రీనివాసులు,డిప్యూటీ తహసిల్దార్లు రామచంద్ర రావు,కిషోర్ కుమార్,సీసీ జగదీష్,సీనియర్ అసిస్టెంట్ బాబు మియా,జూనియర్ అసిస్టెంట్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.

About Author