నెయ్యి కాని నెయ్యి తో తిరుమల లడ్డూల తయారీతో వైసిపి పతనం
1 min read

సిట్ నివేదికలో అంశాలపై ప్రజలను ఏమార్చేలా వైసిపి తప్పుడు ప్రచారం..
దేవదేవుడు ఆగ్రహానికి వైసిపి గురికావడం తథ్యం…
ఇప్పటికన్నా పశ్చాత్తాపం పొంది వైసిపి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి…
పత్తికొండ శాసనసభ్యులు కె. ఈ. శ్యామ్ కుమార్ ఆదేశాలతో పత్తికొండ, మద్దికెర, తుగ్గలి లో టిడిపి బాధ్యులు ప్రెస్ మీట్లు.
పత్తికొండ , న్యూస్ నేడు: ఈ సందర్భంగా పత్తికొండ పట్టణం లో బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రామానాయుడు సొసైటీ చైర్మన్ చందోలి రంగప్ప తుగ్గలి లో మండల అధ్యక్షులు తిరుపాల్ నాయుడు మద్దికెరలో జెడ్పిటిసి మాజీ సభ్యులు రాజన్న యాదవ్ మండల అధ్యక్షులు న్యాసరి లక్ష్మి నారాయణలు గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి లడ్డూల్లో ఉపయోగించే నెయ్యి విషయంలో కల్తీ నెయ్యిని వాడి భక్తుల మనోభావాలు, తిరుమల పవిత్రత దెబ్బతీశారని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ రిపోర్టు బయటకు వచ్చిన సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సిట్ నిజానిజాలు నిగ్గు తేల్చి పాలు, పాలు పదార్థాలే లేని కల్తీ పదార్థాలతో లడ్డూలను తయారు చేసినట్లు బయట పెట్టిందన్నారు. నాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగిందన్నారు. లడ్డూల నాణ్యతను దెబ్బతీసి దేవదేవుడు అయినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు వైసీపీ నాయకులు దెబ్బతీశారని ఆయన విమర్శించారు. తప్పు జరిగిందని సిట్ తేల్చినా పశ్చాత్తాపం లేకుండా వైసిపి నాయకులు ఎదురు దాడి చేస్తున్నారన్నారు. తమ పేరు బయటికి రాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకున్న సంగతి గుర్తు చేశారు.

