ప్రజా సంక్షేమమే కూటమి ధ్యేయం
1 min read

పత్తికొండ శాసనసభ్యులు కే ఈ శ్యామ్ కుమార్ స్పష్టం
పత్తికొండ, న్యూస్ నేడు: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యామ్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం కృష్ణగిరి మండలం అముకుతాడు గ్రామం నందు మన ఊరికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వము నుండి అందుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, డబల్ ఇంజన్ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల తో దూసుకుపోతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో పేదరికానికి కూడా ముగింపు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత అముకుతాడు గ్రామ పంచాయతీ పరిధిలో అముకుతాడు గ్రామానికి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద 20 లక్షలుమండల గ్రాంట్ కింద 10 లక్షలతో మెత్తం 30 లక్షలతో, కర్లకుంట గ్రామానికి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద 15 లక్షలు, మండల గ్రాంట్ 5 లక్షలు, ఇరిగేషన్ కింద 5 లక్షలు, మొత్తం 25 లక్షలు.మాదాపురం గ్రామానికి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద 10 లక్షలు, మండల గ్రాంట్ కింద 10 లక్షలు మొత్తం 20 లక్షలు.పుట్లూరు గ్రామానికి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద 10 లక్షలుమొత్తం 85 లక్షలు రూపాయలతో సీసీ రోడ్లు మరియు డ్రెయిన్లు నిర్మించడం జరిగింది.అలాగే 1st ఫేస్ కింద 62nd ఫేస్ కింద 9 మొత్తం 15 మినీ గోకులాలను నిర్మించడం జరిగింది అని అన్నారు.

