NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎద్దుల పోటీలను ప్రారంభించిన డాక్టర్ సుధీర్

1 min read

డాక్టర్ సుధీర్ కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ..

మిడుతూరు నందికొట్కూరు) న్యూస్​ నేడు :నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని రోళ్ళపాడు గ్రామంలో శ్రీ బరక సంజీవరాయ స్వామి తిరుణాల సందర్భంగా రాష్ట్రస్థాయి రెండు పళ్ళ  ఎద్దుల పోటీలు బ్రహ్మాండంగా జరిగాయి.ఎద్దుల పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా నందికొట్కూరు వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ గురువారం ప్రారంభించారు.ఈ పోటీల్లో 28 జతల వృషభలు పాల్గొన్నాయని ఆలయ ధర్మకర్త పేరెడ్డి మురళీమోహన్ రెడ్డి అన్నారు.గెలుపొందున వృషభ రాజుల యజమానులకు నగదును డాక్టర్ సుధీర్ మరియు మురళీమోహన్ రెడ్డి అందజేశారు.తర్వాత డాక్టర్ సుదీర్ ను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. మధ్యాహ్నం నందికొట్కూరు పట్టణంలోని డాక్టర్ సుధీర్ స్వగృహంలో డాక్టర్ సుధీర్ జన్మదిన సందర్భంగా భారీ కార్యకర్తల సమక్షంలో కేకును కట్ చేశారు.ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి,మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చిన్న మల్లారెడ్డి,యాట ఓబులేష్,మన్సూర్,మల్లేశ్వర్ రెడ్డి,రమణ,లడ్డు,చరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు.

About Author