తపాలా పొదుపు,జీవిత బీమా లపై మూడు డివిజన్ ల సమీక్ష సమావేశం
1 min read

వివిధ రెవెన్యూ లక్ష్యాలను సాధించిన ప్రతిభావంతులైన ఉద్యోగులను మెమొటోలు,సర్టిఫికెట్స్ అందజేసీ సత్కరించారు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు,భీమవరం, తాడేపల్లిగూడెం డివిజన్ల తపాలా పొదుపు మరియు జీవితబీమా పథకాల సమీక్షా సమావేశం ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయ సనూవేశ మందిరం వేదికగా గురువారం ఏలూరు తపాలా సూపరింటెండెంట్ ఎస్. విజయ భాస్కర్ అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ కె.సంతోష్ నేత,ఐపిఓ స్ విచ్చేసినారు.పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు మరియు తక్కువ ప్రీమియం మరియు ఎక్కువ బోనస్ గల తపాలా జీవిత బీమా మరియు గ్రామీణ తపాలా జీవిత బీమా ఆవశ్యకతపై భీమవరం, తాడేపల్లిగూడెం మరియు ఏలూరు డివిజన్ల తపాలా సిబ్బందితో ముఖ్య అతిధి కె. సంతోష్ నేత అవగాహన సదస్సు మరియు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ రెవిన్యూ లక్ష్యాలను సాధించిన ప్రతిభావంతులైన ఉద్యోగులను ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి సంతోష్ నేత మాట్లాడుతూ ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన పోస్ట్ ఆఫీస్ పొదుపు మరియు జీవిత బీమా పథకాలను ఉద్యోగులంతా విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని, తద్వారా ప్రజలంతా ఆయా పథకాలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని సూచించారు. అలాగే వినియోగదారులు తమ సమీప పోస్ట్ ఆఫీస్ లను సందర్శించి వివిధ పొదుపు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మరియు ఫిబ్రవరి 18,19 మరియు 20 వ తేదిలలో జరుగు మెగా తపాలా జీవిత బీమా డ్రైవ్ ను కూడా సద్వినియోగం చేసుకోగలరని కోరారు.ఈ కార్యక్రమంలో భీమవరం డివిజన్ సీనియర్ తపాలా సూపరింటెండెంట్ కె.హరికృష్ణ ప్రసాద్,డిప్యూటీ సూపరింటెండెంట్ ఏ.వి. సురేష్ కుమార్,తాడేపల్లిగూడెం సూపరింటెండెంట్ ఎం.శ్రీనివాసు మరియు ఈ మూడు డివిజన్ల సబ్ డివిజన్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

