అచ్చమ్మ పేరంటాల తల్లి 69వ వార్షికోత్సవాలు
1 min read

శాకాంబరిగా అచ్చమ్మ పేరంటాలు తల్లి దర్శనం
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల నుండి తరలివచ్చిన భక్తజనం
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దెందులూరు మండలం గాలాయగూడెం గ్రామంలో శ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లి మంగళవారం శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అచ్చమ్మ పేరంటాలు తల్లి 69వ వార్షిక మహోత్సవం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా శాకంబరిగా అలంకరించారు. ఈ అలంకరణ కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన పెద్దిశెట్టి బసవయ్య కుటుంబ సభ్యుల సహకారంతో ఘనంగా నిర్వహించారు. పుష్పాలు, కూరగాయలతో ఆకర్షణీయంగా రూపొందించిన శాకంబరి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారి దర్శనార్థం ఇచ్చారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

