ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు: ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించిన ఎస్టియు దశల వారి ఆందోళనలో భాగంగా శుక్రవారం పత్తికొండ తహసిల్దార్ కు ఉపాధ్యాయులు వినతి పత్రం అందజేశారు . ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేసి, 30% మద్యంతర భృతిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని వారు విజ్ఞప్తి చేశారు. సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57 మేరకు 2004 సెప్టెంబర్ ఒకటి నవంబర్ నోటిఫికేషన్ ద్వారా నియమితులైన 2003 ఉపాధ్యాయులు, పోలీసులు, మరియు ఇతర శాఖల ఉద్యోగులకు పాత పెన్షన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు మరుసటిరోజే పెన్షన్స్ సౌకర్యాలు చెల్లించాలని అన్నారు. పెన్షనర్లకు చెల్లించవలసిన నాలుగు డీఏలను వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్టియు సీనియర్ నాయకులు సత్యనారాయణ, ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర మండల అధ్యక్ష కార్యదర్శులు ఆవుల నాగరాజు మారుతి, ఎస్టీ జిల్లా కౌన్సిలర్ బలరాముడు, సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి , ఇక్బాలు హుస్సేన్ , ఉల్తెన్న,కౌలుట్లయ్య మొదలగువారు పాల్గొన్నారు.

