సైబర్ క్రైమ్,బ్యాడ్ టచ్ గుడ్ టచ్, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన
1 min read

పెదపాడు ఎస్ఐ ఆర్. శ్రీనివాసరావు
ఏలూరు, న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు, పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్ ఆధ్వర్యంలో, పెదపాడు ఎస్ఐ ఆర్. శ్రీనివాస్ తమ పోలీస్ సిబ్బందితో కలిసి పెదపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులకు సైబర్ క్రైమ్‌ల పట్ల జాగ్రత్తలు, ట్రాఫిక్ నిబంధనలు,గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. బాల్య వివాహాల వలన కలిగేటటు వంటి దుష్పరిణామాలను గురించి చిన్న వయసులోనే వివాహాలు జరిగితే శారీరకంగా ఏర్పడే లక్షణాలను గురించి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేస్తూ ఎవరైనా బాల్యవివాహాలకు పాల్పడితే 1098 కి సమాచారాన్ని అందించాలని,ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే డయల్ 112 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైన వారు తక్షణమే 1930 హెల్ప్‌లైన్ కు ఫిర్యాదు చేసిన ట్లయితే, పోలీస్ శాఖ వెంటనే సహాయ చర్యలు తీసు కుంటుందని వివరించారు.అదే విధంగా రహదారి ప్రమాదాల సందర్భంలో గాయ పడిన వారికి సహాయం చేసిన వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న “గుడ్ సమారిటన్ పథకం” ద్వారా రూ.5,000/- నగదు ప్రోత్సాహకం మరియు ప్రశంస పత్రము లను అందజేస్తుందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్ అనగా తొలి ఒక గంట లోపు క్షత గాత్రులను సమీపం లోని ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించాల్సిన అవసరాన్ని వివరించారు.పోలీస్ దర్యాప్తు ప్రక్రియలో సహాయ పడిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రజలు నిర్భయంగా పోలీసులకు సహకరించాలని విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

