NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ మంత్రి అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం…

1 min read

తీవ్రంగా ఖండించిన మండల టిడిపి నాయకులు…

హోళగుందన్యూస్ నేడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైఅంబటి రాంబాబు చేసిన అనుచిత, సభ్యకర వ్యాఖ్యలురాజకీయ విమర్శలు హద్దులు దాటి ప్రజాస్వామ్య విలువలపైనే దాడి చేసే స్థాయికి చేరాయనీ, ప్రభుత్వ విధానాలపై మాట్లాడే దమ్ము ధైర్యం లేకవ్యక్తిగత దూషణలకు దిగడం వైసీపీ రాజకీయ పతనానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ మండల నాయకులు నుండిపడ్డారు. ఆం. ఐటి రాంబాబు ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ అంబటి రాంబాబు దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు చొరవతోనే రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు ముగింపు వచ్చిందనీ గుర్తు చేశారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ కలిగి, సహనంతో వ్యవహ దించేవారనీ ఆ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. తిరుమల నెయ్యిలో కల్తీ జరిగిన వాస్తవాన్ని తప్పును కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నేతలు అడ్డంగా వాడనలు చేస్తున్నారని మండిపడ్డారు. కల్తీ జరిగింది కాబట్టే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రక్షణులోకి దిగాల్సి వచ్చిందనీ పేర్కొన్నారు ఇది రాజకీయ అంశం కాదని తిరుమల పవిత్రతకు సంబంధించిన అత్యంత సున్నితమైన విషయం అనిఅన్నారు.కల్తీ చేసి తప్పు చేసినవారు తిరుసుల వెళ్లి వెంకన్న స్వామికి క్షమాపణలు చెప్పాలనీ హితవు పలికారు అదేవిధంగా ముఖ్యమంత్రి మీద చేసిన దూషణలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇకపై ఏ నాయకుడైన తప్పుగా మాట్లాడితే కార్యకర్తలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.బూతులు రాజకీయా లతో నిజాలను దాచలేరనీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారనీ సమయం వచ్చినప్పుడు ప్రజలే తగిన గుణపారం చెబుతారు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్డాక్టర్ తిప్పయ్య, తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి శేషగిరి, కో కన్వీనర్ జాకీర్, రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదం, మండల కార్యదర్శి మురళి, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి అబ్దుల్ సుధాన్, మండల టిడిపి మైనార్టీ అధ్యక్షుడు ముల్ల మోయిన్, తెలుగు యువత మండల అధ్యక్షుడు బకాడి. వీరేష్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గజ్జెహళ్లి సబీ సాజ్, లౌడ్ అధ్యక్షుడు అయ్యప్ప, సొసైటీ డైరెక్టర్ దుర్గయ్య, జమపురా సురేష్ లాబ్ గిరి, సలీం, బూత్ కన్వీనర్లు టి.పి సాయిబేష్ వలి బాషా, తాహెర్, హనుమండు, హుస్సేన్ పీరా, మండల టిడిపి మైనార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ , టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author