NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లింగపాలెం మండలంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం

1 min read

రాజ్యముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి , చింతలపూడి శాసనసభ్యులు సోoఘ రోషన్ కుమార్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:“మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం ద్వారా  జిల్లాలో 77 వేల 500 రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందించామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.  లింగపాలెం మండలం గణపావారిగూడెం గ్రామంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ తో కలిసి సోమవారం  రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రీ సర్వే అనంతరం  సవరించిన భూ వివరాలు, కివ్​ఆర్​ కోడ్, రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.   రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాల ద్వారా రైతులకు వారి భూమిపై వారికి  స్పష్టమైన హక్కులు కల్పిస్తున్నామని ,  కివ్​ఆర్​ కోడ్‌ను స్కాన్ చేయగానే సర్వే నంబర్లు, విస్తీర్ణం, పట్టాదారు పేరు తదితర భూ వివరాలు డిజిటల్ రూపంలో కనిపిస్తాయని,  దీనివల్ల రైతులకు తమ భూమి  సమాచారం మరింత సులభంగా అందుబాటులో ఉంటుందన్నారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం ద్వారా . రీ-సర్వే అనంతరం రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు. రెండవ విడతలో ఈనెల 2వ తేదీ నుండి 9వ తేదీ వరకుక్ ఎంపిక చేసిన గ్రామాలలో పట్టాదారు పాస్‌బుక్కులు పంపిణీ జరుగుతుందని ఎమ్మెల్యే తెలియజేసారు.నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, తహసీల్దార్  నజీముల్లాషా, జిల్లా వ్యవసాయాధికారి  హబీబ్ భాషా, వ్యవసాయ శాఖ ఏడి సుబ్బారావు,రెవిన్యూ అధికారులు,స్థానిక ప్రముఖులు  పాల్గొన్నారు.

About Author