NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చిత్తడినెలలపై విద్యార్థులకు అవగాహన

1 min read

మహానంది, న్యూస్​ నేడు: మహానందిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు చిత్తడి నేలలపై మహానందిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో  అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం   ఫారెస్ట్ రేంజర్ జడ్ ఎన్. జా  ఫారెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్/ డీఎఫ్ఓ అనురాగ్ మీనా సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు .చిత్తడి నేలలు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని ముఖ్యంగా స్పాంజి ఏ విధంగా నీటిని పీల్చుకొని నిలువ ఉంచుకుంటుందో అదేవిధంగా చిత్తడి నేలలు నీటిని విలువ ఉంచుకుంటాయని విద్యార్థులకు తెలిపారు. ఇటీవల వేసవిలో కూడా నీటి ఎద్దడి ఉండడదు ని పేర్కొన్నారు .మడ అడవులతో పాటు చిత్తడి నేలలు వరదలను, సునామీల నుండి రక్షిస్తాయన్నారు.  వరదల సమయంలో వచ్చే నీటిని నిల్వ చేసుకుంటూ వరద ప్రభావాన్ని తగ్గిస్తాయన్నారు. చిత్తడి నేలలు చెరువులు, కుంటల్లోని నీటిలో ఉన్న మురికిని కూడా తమలో ఇమిర్చి కొని స్వచ్ఛమైన నీటిని బయటికి పంపిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ లు హైమావతి, రామకృష్ణ, ఆశ్రమ పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం హరి తో పాటు ఉపాధ్యాయులు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జి శ్రీనివాసులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

About Author