ఆశాలకు అన్ని సంక్షేమ పథకాలు అందాలి
1 min read

ఈనెల 12న జరిగే సార్విత్రిక సమ్మెలో ఆశాలు పాల్గొనండి. సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర,
పత్తికొండ, న్యూస్ నేడు: ఆశా వర్కర్లకు అన్ని విధాల ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపచేయాలని సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర కోరారు. గురువారం పత్తికొండ మండలం పుచ్చకాయల మాడ గ్రామం లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ముందు ఆశ వర్కర్ల సమావేశం నిర్వహించి, ఈనెల 12న జరిగే సార్వత్రిక సమ్మె నోటీసును డాక్టర్ రాఘవ నాయుడుకు అందించారు. ఈ సమావేశానికి ఆశా వర్కర్ల యూనియన్ మండల నాయకురాలు స్వాతి, అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర, ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఈనెల 12న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెలో ఆశా కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆశా కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, 26వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, ఆశ వర్కర్ల నియామకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. అలాగే ఆరోగ్య రంగానికి జిడిపి లో 6% నిధులు కేటాయించాలిని కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ని ఆశాలుగా మార్చాలని అన్నారు. సమాన వేతనం, ఇతరసౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీ కరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని ఆపాలని, ప్రజా సంపదను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.లేబర్ కోడ్స్ రద్దుచేయాలని. కార్మిక చట్టాలను పటిష్ట పరిచి 29 చట్టాలను పునరుద్ధరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ, కేశమ్మ, నాగవేణి, కొండమ్మ, రంగమ్మ, పుష్ప, వెంకటలక్ష్మి, సునీత, తదితరులు పాల్గొన్నారు.

