NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

 టి డి పి  లోనే…అంద‌రికీ భ‌విష్యత్తు… మంత్రి టీజీ భ‌ర‌త్

1 min read

కర్నూలు పార్లమెంట్ నూత‌న క‌మిటీ ప్రమాణ‌స్వీకార కార్యక్రమంలో మంత్రి టీజీ భ‌ర‌త్

కర్నూలు, న్యూస్​ నేడు:  తెలుగుదేశం పార్టీతోనే నాయ‌కులంద‌రికీ భ‌విష్యత్తు ఉంటుంద‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. క‌ర్నూలు న‌గ‌రంలోని ఎం.ఆర్.సి ఫంక్షన్ హాలులో తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. పార్ల‌మెంట్ అధ్యక్షురాలిగా గుడిసె క్రిష్ణమ్మ‌, ప్రధాన కార్యద‌ర్శిగా నాగ‌రాజు యాద‌వ్, ఉపాధ్యక్షులుగా సోమిశెట్టి శ్రీకాంత్, త‌దిత‌రులు, ఇత‌ర కార్యవ‌ర్గం మొత్తం ప్రమాణ స్వీకారం అనంత‌రం మంత్రి మాట్లాడుతూ అన్ని సమీకరణాలు పరిశీలించి అదిష్టానం కొత్త కమిటీని ఎంపిక చేసింద‌న్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు దక్కిందన్నారు. రాబోయే ఏ ఎన్నికల్లో అయినా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించేందుకు కొత్త క‌మిటీ కష్టపడాలని ఆయ‌న సూచించారు. ఇక బ‌హిరంగ వేదిక‌ల్లో పార్టీకి డ్యామేజ్ అయ్యేవిధంగా ఎవరు ప్రవర్తించొద్ద‌ని చెప్పారు. పెద్ద కుటుంబంలాంటి తెలుగుదేశం పార్టీలో నాయ‌కుల మ‌ధ్య ఇబ్బందులుంటే కూర్చొని మాట్లాడుకోవాల‌న్నారు. 19 నెలల కాలంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి ప‌నులు చేసిన‌ట్లు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం జీవితాంతం కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. ఇక‌ వైసీపీ నేతల ఆలోచన విధానం ఓడిపోయిప్పటికీ మార‌లేద‌న్నారు. ఆ పార్టీలో బూతులు మాట్లాడే వారికి మార్కులు పడతాయన్నారు. వైసీపీ అధ్యక్షునిగా జగన్మోహన్ రెడ్డిని మార్చి వేరే వారికి అవ‌కాశం ఇస్తే బాగుంటుంద‌న్నారు.

About Author