మీ భూమి – మీ హక్కు ముఖ్యమంత్రి కార్యక్రమంలో హొళగుంద టిడిపి శ్రేణులు
1 min read
హోళగుందన్యూస్ నేడు: బాబు’తోనే రైతుల భవిష్యత్తకు భరోసాసి.యం చేతుల మీదుగా రైతన్నలకు రాజముద్రతో కూడిన పట్టాదారు పుస్తకాల పంపిణిసభకు ఆలూరు టిడిపి ఇంచార్జి వైకుంఠం జ్యోతి నాయకత్వంలో పెద్దఎత్తున హజరైన హొళగుంద నాయకులు రైతే రాజు అనే నానుడిని నిజం చేసే సుసంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం తరఫున ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రైతన్నల ఆత్మబంధువు, ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుహస్తాల మీదుగా రైతన్నలకు ప్రభుత్వ అధికారిక రాజముద్రతో కూడిన ఉచిత పట్టాదారు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆలూరు టిడిపి ఇంచార్జి వైకుంఠం జ్యోతి అధినాయకత్వంలో హొళగుంద తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని తమ అభిమానాన్ని ఎలుగేత్తి చాటారు.నాయకులు తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యట శేషగిరి, మండల కన్వీనర్ తుంబళం తిప్పయ్య,సింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, దేవగట్టు చైర్మన్ వీరనాగప్ప, జిల్లా కార్యదర్శి నెరణికి మల్లికార్జున, సీనియర్ నాయకులు ఎళ్లార్తి మల్లికార్జున తదితరులు మాట్లాడుతూ గత వైసిపి పాలనలో రైతుల పట్టాదారు పుస్తకాలు తప్పులతడకగా మరియు స్వార్థ ప్రచారస్రాలుగా నిలిచాయాన్నారు. రాష్ట్ర ప్రగతిలో రైతన్నలకే మొదటి ప్రాధాన్యతనిస్తూ ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ అనే బృహత్తర పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడమే కాక సబ్సిడీ ధరలకే యూరియా మరియు ట్రాక్టర్లు, స్ప్రే పంపులు, వ్యవసాయ పనిముట్లను అందిస్తున్నదని వివరించారు.ఈ కార్యక్రమంలో హెబ్బటం ఉప సర్పంచ్ సవారప్ప, టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ హెబ్బటం మల్లికార్జున,సీనియర్ నాయకులు మేదహాళ్ హుస్సేన్ పీరా, మాజీ గ్రామ అధ్యక్షులు కురువ మల్లికార్జున, యువనాయకులు ఎల్లార్తి చిదానంద మరియు మరితర కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

