NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్. రంగాపురం గ్రామంలో నాబార్డ్ వాటర్‌షెడ్ అభివృద్ధికి  భూమి పూజ

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని ఎస్. రంగాపురం గ్రామంలో నాబార్డ్ వాటర్‌షెడ్ అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి  మరియు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ కుమారి గనియా ,నాబార్డ్ వాటర్‌షెడ్ డీడీ ఎం కే.ఆర్.డి.కార్తీక్ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు గ్రామాభివృద్ధి, జల సంరక్షణ ప్రాముఖ్యతపై మాట్లాడుతూ, నాబార్డ్ వాటర్‌షెడ్ పథకం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాల సంరక్షణ, సాగునీటి వసతుల మెరుగుదలతో పాటు వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుందని తెలిపారు.తెదేపా సీనియర్ నాయకులు లక్కసాగరం లక్ష్మి రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా రేణుక, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, ఎంపిడిఓ శ్రీనివాసరావు,తేదేపా నాయకులు సీమా సుధాకర్ రెడ్డి, లక్ష్మి నారాయణ యాదవ్, ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి, ఏనుగమర్రి రామకృష్ణ,బత్తుల రామేష్ రెడ్డి, నాగేంద్ర,గోల్ల రామ్మోహన్ యాదవ్,ముస్లిం మైనార్టీ నాయకులు ఖాజా ఫీర్, తేదేపా మండల కన్వీనర్ సుదర్శన్,పట్టణ అధ్యక్షుడు కోంగన పల్లే మదు,ప్రిన్స్ పాల్ మదు,నల్లమెకలపల్లె సత్యం  , రాజశేఖర్, పెద్ద పూజర్ల ప్రసాద్ రెడ్డి, సుధాకర్ గుప్తా, అదే బాద్ పరమేష్, ఎంఆర్ఓ భరతి, డిప్యూటీ ఎంపీడీవో ప్రభాకర్, హార్టికల్చర్ అధికారి కళ్యాణి, ఎస్.రంగాపురం రైతు రంగస్వామి, నాబార్డ్ వాటర్ షెడ్ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author