NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రోగులకు సమర్థవంతంగా వైద్యులు మెరుగైన వైద్యం అందించాలి 

1 min read

 పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాం కుమార్                   

పత్తికొండ , న్యూస్​ నేడు:  రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా వైద్య సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని పత్తికొండ ఎమ్మెల్యే గౌరవనీయులు కే.ఈ. శ్యామ్ కుమార్  సూచించారు.శనివారం  పత్తికొండ ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ₹5 కోట్ల 75 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆసుపత్రి అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్  భూమి పూజ నిర్వహించారు. అనంతరం వైద్యులతో సమావేశం నిర్వహించి, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పత్తికొండ ప్రభుత్వ వైద్యశాలను పరిశుభ్రంగా నిర్వహిస్తున్నందుకు డాక్టర్లు మరియు ఆసుపత్రి సిబ్బందిని అభినందించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, టెక్నికల్ సిబ్బంది సంఖ్య తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, మందుల సరఫరా పరిస్థితిపై ఆరా తీసి, ఆసుపత్రిని పరిశీలించారు.వైద్య సేవలపై అక్కడ చికిత్స పొందుతున్న రోగులతోనూ మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author