NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలి

1 min read

ఫిబ్రవరి 23 నుండి మార్చి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు

జిల్లాలో 55 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ

సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు

జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి

నంద్యాల, న్యూస్​ నేడు : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టంగా నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ యుగంధర్ బాబు, డీఆర్ఓ రాము నాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న, డీఈఓ జనార్దన్ రెడ్డి, డీఐఓ శంకర్ నాయక్, జిల్లా కార్మిక అధికారి బషీరున్నిసా, ఎస్ఎస్ఎ పీఓ నిత్యానంద రాజు, డీఈసీ సభ్యులు సునీత, సుంకన్న, మద్దిలేటి స్వామి, రమణ, శ్రీకాంత్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేయాలని, ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు డిప్యూటీ తహశీల్దార్లను కేటాయించాలని డీఆర్ఓను ఆదేశించారు. రహదారులకు సమీపంలో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పరీక్షలు ముగిసిన వెంటనే సమాధాన పత్రాలను భద్రతతో పోస్టు కార్యాలయాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని పోస్టల్ శాఖ అధికారులను ఆదేశించారు.అదనపు ఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ, ప్రశ్న పత్రాల సెట్టు నెంబర్లు అందిన వెంటనే పోలీసు ఎస్కార్ట్‌తో పరీక్షా కేంద్రాలకు ప్రశ్న పత్రాలు తరలించే ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేస్తామని అన్నారు.

About Author