జానాల గూడెం బాధితులకు నిత్యావసర సరుకులు
1 min read

బాధిత కుటుంబాలకు అండగా:మాల మహానాడు
నందికొట్కూరు , న్యూస్ నేడు : కొత్తపల్లి మండలం జానాల గూడెం బాధితులకు నందికొట్కూరు పివి రావు మాల మహానాడు అండగా ఉంటుందని మాల మహానాడు నాయకులు డాక్టర్ డి వెంకటేష్ అన్నారు.నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం జానాల గూడెం మాల కుటుంబాలను సోమవారం గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించి బాధితులతో మాట్లాడారు.గత నెలలో అగ్రవర్ణాల కుట్రలో భాగంగా అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడం జరిగింది. బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.న్యాయపరంగా బాధితులకు అండగా ఉంటామని అన్నారు.బాధితులకు కొంతమంది దాతల సహకారంతో నిత్యవసర వస్తువులు కూరగాయలను అందజేసినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలోపాములపాడు అబ్రహాం, కలబండి చిన్న అంకన్న, నాగరాజు,మిడుతూరు దేవ నాగరాజు,జూపాడుబంగ్లా మాధవరం రంగస్వామి, రంగయ్య,మల్రెడ్డి రవికుమార్,మధు,అరే రాజు తదితరులు పాల్గొన్నారు.

