NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిరంతర వాతావరణ గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రం ప్రారంభం

1 min read

ఏలూరు జిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు: జాతీయ స్వేచ్ఛ వాయు కార్యక్రమంలో భాగంగా కోర్టు సెంటర్ సముదాయంలో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ నిరంతర వాతావరణ గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రం  వాయు కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కాలుష్య నివారణకు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.  జిల్లా జడ్జ్ ఎస్. శ్రీదేవి మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా ఏలూరు నగరంలో వాయు కాలుష్య స్థాయులను రియల్ టైమ్‌లో పర్యవేక్షించడం సాధ్యమవుతుందని, తద్వారా పర్యావరణ నిర్వహణకు మరియు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు శాస్త్రీయ ఆధారాలతో నిర్ణయాలు తీసుకోవడానికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు. అనంతరం  నిరంతర వాతావరణ గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రం పనితీరుపై ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రధాన కార్యాలయం, విజయవాడకు చెందిన జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్  జగదీష్  మరియు ఏలూరు పర్యావరణ ఇంజినీర్  రామచంద్రమూర్తి,   సాంకేతిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రధాన కార్యాలయం, విజయవాడ  పర్యావరణ ఇంజినీర్ శ్రీరామచంద్రమూర్తి, , ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, ఏలూరు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author