NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ధర్నాలతో దద్దరిల్లిన నందికొట్కూర్

1 min read

కార్మికుల ద్రోహి నరేంద్ర మోడీ

సీపిఎం,సిఐటియు,సిపిఐ,ఐఎఫ్ టియు ధర్నా..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: కార్మికులకు 12 గంటల పని దినాన్ని తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం వీటికి వ్యతిరేకంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం ధర్నాలతో దద్దరిల్లింది. వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఐ,ఐఎఫ్ టియు, సిఐటియు,ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా విజయవంతం అయింది.ధర్నా చేయడంతో పట్టణంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది.వ్యకాస జిల్లా అధ్యక్షులు నాగేశ్వరావు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసేవరకు ఉద్యమం కొనసాగిస్తామని అన్నారు.ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేట్ పరం ఉపసంహరించుకోవాలని, ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని,ఉద్యోగ కార్మికులకు భద్రత కల్పించాలన్నారు.సిపిఐ రాష్ట్ర నాయకులు రమేష్ బాబు మాట్లాడుతూ 12 గంటల పని దినాన్ని కేంద్రం తీసుకువస్తే రాష్ట్రంలో నీచమైన కూటమి ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. నరేంద్ర మోడీ చట్టాలను మారుస్తూ ఉన్నారని అన్నారు.ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు మజీద్ మియా మాట్లాడుతూ చారిత్రాత్మక పోరాటాల ద్వారా సాధించుకున్న 8 గంటల పని దినాన్ని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. పట్టణంలో ర్యాలీ అనంతరం తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పిక్కిలి వెంకటేశ్వర్లు,పక్కిర్ సాహెబ్, మున్సిపాలిటీ కార్మికులు, అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author