అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టిన మంత్రి టీజీ భరత్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ రెండు బిల్లులు ప్రవేశపెట్టారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు బదులుగా మంత్రి టీజీ భరత్.. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల బిల్లు 2026ను, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 2వ సవరణ బిల్లును ప్ర వేశపెట్టారు. బిల్లులు సభ ఆమోదం పొందినట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ప్రకటించారు.

