NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గోవాలో గెలుపు ఘనత

1 min read

సౌత్ ఏషియన్ సాంప్రదాయ విలువిద్యలో ఆంధ్ర ప్రదేశ్ కు 8 పతకాలు

కర్నూలు, న్యూస్​ నేడు:  సౌత్ ఏసియన్   ట్రేడిషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో ఆంధ్ర ప్రదేశ్  క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి మొత్తం 4 బంగారు, 3 రజత, 1 కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీలు ఈ నెల 12వ తేదీ నుండి 15వ తేదీ వరకు గోవాలో నిర్వహించబడ్డాయి.అండర్-10 రికర్వ్ విభాగంలో వై. విమల్ కుమార్ బంగారు పతకం సాధించగా, అండర్-12 రికర్వ్ విభాగంలో ఎన్. గునిత్ రెడ్డి స్వర్ణం అందుకున్నారు. అండర్-14 ఇండియన్ రౌండ్ విభాగంలో జి. హన్విక మరియు అవంతిక అద్భుత ప్రదర్శనతో పతకాలు కైవసం చేసుకున్నారు. అండర్-17 ఇండియన్ అరౌండ్ విభాగంలో బి. మాధురి బంగారు పతకాన్ని గెలుచుకొని ఆంధ్ర ప్రదేశ్  ఖ్యాతిని మరింత పెంచారు.ఇతర విభాగాల్లో కూడా క్రీడాకారులు రజత, కాంస్య పతకాలు సాధించి ఆంధ్ర ప్రదేశ్ కు తీసుకువచ్చారు. విజేతలను కోచ్‌ రాజు, తల్లిదండ్రులు మరియు క్రీడా ప్రేమికులు అభినందించారు.ఈ విజయాలు క్రీడాకారుల కృషి, పట్టుదల ఫలితమని ట్రెడిషనల్ ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ డా. హరికిషన్, జాయింట్ సెక్రటరీ వై. శ్రీరాములు, ఆర్గనైజేషన్ సెక్రటరీ ఎన్. వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

About Author