ఘనంగా పదవ తరగతి విద్యార్థులకు సరస్వతి పూజ
1 min read

హోలగుంద న్యూస్ నేడు: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హోలగుంద లో పదవ తరగతి విద్యార్థులకు సరస్వతి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి కబీర్ సాబ్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు మంచి ప్రవర్తనతో చదువును కొనసాగిస్తూ మంచి పేరు పొందాలన్నారు అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు ప్రతి సబ్జెక్టులో మంచి మార్కులు పొందడానికి అనుసరించవలసిన మెళుకువలు (టిప్స్) వివరించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై దిలీప్ కుమార్ పాల్గొని విద్యార్థులు బాగా చదవాలని మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని ఆడపిల్లలు ఎట్టి పరిస్థితులలోనూ చదువును కొనసాగించాలని తన ప్రసంగంలో పేర్కొన్నారు ఈసారి పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న 316 మంది విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ అందించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నాగరాజు, పోలీసులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్ ద్వారకనాథ్, కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


