బిజినవేముల పాఠశాలకు పూర్వవిద్యార్థుల చేయూత
1 min read

బీరువా,పోర్టబుల్ స్పీకర్లు అందజేత..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బిజినవేముల మండల పరిషత్ పాఠశాలకు పూర్వ విద్యార్థులు బీరువా, పోర్టబుల్ స్పీకర్లు అందజేశారు.తాము చదువుకున్న పాఠశాలపై ఉన్న మమకారంతో ప్రస్తుత విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో పూర్వ విద్యార్థులు మురళీధర్ (పిఎస్ హెచ్ఎం), రమణయ్య బీరువా, పోర్టబుల్ స్పీకర్లు విరాళంగా పాఠశాల హెచ్ఎం నాగప్రసాద్,ఉపాధ్యాయుడు పెరుమాళ్ళ రాజశేఖర్ కు బుధవారం అందజేశారు.ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా పూర్వ విద్యార్థుల బాధ్యతగా భావించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.ఈ మధ్యన పాఠశాల అభివృద్ధికి 50 వేల విలువైన సామాగ్రిని అందించడం జరిగిందని బుధవారం బీరువా,పోర్టబుల్ స్పీకర్లు అందించి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న పూర్వ విద్యార్థులకు పాఠశాల హెచ్ ఎం నాగప్రసాద్,పెరుమాళ్ళ రాజశేఖర్ శాలువా కప్పి సన్మానించారు.ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్,పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసులు, పద్మావతి,జయంతి పాల్గొన్నారు.


