రాష్ట్ర అర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ డూండీ రాఖేష్‌ను సన్మానించిన నంద్యాల నాగేంద్ర
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరానికి విచ్చేసిన తెలుగుదేశంపార్టీ నాయకులు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ గ డూండీ రాకేష్ ని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ డైరెక్టర్ నంద్యాల నాగేంద్ర, రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు సోమిశెట్టి నవీన్, లీగల్‌సెల్ జిల్లా ప్రధానకార్యదర్శి యల్.వి. ప్రసాద్, జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షులు పెరపోగు రాజు మాజీ జిల్లా టిడిపి కార్యదర్శి నాగార్జున చౌదరి పార్టీ నాయకులు జగదీష్, వాణిజ్య సెల్ కార్యదర్శి ఉపేంద్ర, మరియు కార్యకర్తలు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు పూలమాలలతో స్వాగతం పలికి, శాలువాతో ఘణంగా సత్కరించారు.ఈ సందర్భంగా నాగేంద్ర, నవీన్ మాట్లాడుతూ గత వై.సి.పి. ప్రభుత్వం హయాంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పార్టీ కోసం పనిచేసిన శ్రీ డూండీ రాకేష్ నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా పాదయాత్ర మొదలుకొని వారి యాత్రముగిసే వారకు శ్రీ నారా లోకేష్ కి వెన్నంటి ఉండి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎన్నో విధాలుగా తోడ్పాటునందించారనీ, అలాంటి వ్యక్తిని గుర్తించిన శ్రీ నారా చంద్రబాబునాయుడు వారిని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమించి తగిన విధంగా వారికి న్యాయం చేకూర్చారనీతెలిపారు.

