NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డాక్టర్ అశ్వర్థ్ బాబును ఘనంగా సన్మానించిన వీసీ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  రాయలసీమ మరియు క్లస్టర్ యూనివర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో క్వాంటం టెక్నాలజీపై రాయలసీమ యూనివర్సిటీ సెనేట్ హాలులో నిర్వహిస్తున్న 6రోజుల అధ్యాపకుల శిక్షణా కార్యక్రమం  మూడవరోజైన నేడుకూడా కొనసాగింది. నేటి ఉదయం సెషన్లో IIIT ధార్వాడ, కర్నాటక నుండి వచ్చేసిన డాక్టర్ హెచ్. అశ్వర్థ్‌ బాబు క్వాంటం అల్గారిథమ్ గురించి వివస్తూ VQE అల్గారిథమ్ గురించి, భౌతిక గణిత శాస్త్రాలతో సమన్వయం చేస్తూ వివరించారు. అలాగే క్వాంటం కంప్యూటంగ్లోని ప్రోగ్రామింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ గురించి తెలిపారు. మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో భాగంగా CSIR – NPL కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఆచార్య జి. భగవన్నారాయణ క్వాంటం కంప్యూటింగ్‌ సమగ్ర స్వరూపాన్ని, ఔషధరంగంలో ఆవిష్కరణలకు, సైబర్ సెక్యూరిటీని పెంపొందించడంలో క్వాంటం కంప్యూటింగ్ పాత్రను వివరించారు. అలాగే క్వాంటం ప్రోటోకాల్స్ ఎస్టిమేషన్ టెక్నిక్లగురించి అధ్యాపకులకు అవగాహన కల్పించారు. మధ్యాహ్నం కొనసాగిన రెండో సెషన్లో   ట్రీపుల్ఐటి  ధార్వాడ, కర్నాటక నుండి వచ్చేసిన డాక్టర్ హెచ్. అశ్వర్థ్‌ బాబు QAOA అల్గారిథమ్ గురించి తెలియజేస్తూ అధ్యాపకుల సందేహాలను నివృత్తిచేశారు. అనంతరం గత రెండు రోజులుగా విషయం నిపుణులుగా వ్యవహరించిన డాక్టర్ అశ్వర్థ్ బాబును వైస్ ఛాన్సలర్ ఆచార్య వెంకట సుబ్బారావు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎఫ్​డిపి  FDP కన్వీనర్, క్లస్టర్ యూనివర్సిటీ QIC కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. పద్మావతితోపాటు, రాయలసీమ యూనివర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య సి. వి. కృష్ణారెడ్డి, IQAC డైరెక్టర్ ఆచార్య ఆర్. భరత్ కుమార్, డాక్టర్ వాయిజ్ తోపాటు వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

About Author