జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రెగ్యులర్ ఉద్యోగ పోస్ట్ ల వ్రాత పరీక్ష
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కర్నూలు నందు రికార్డు అసిస్టెంట్ మరియు ఫ్రెంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ రెగ్యులర్ ఉద్యోగ పోస్ట్ ల కొరకు ఇచ్చిన నోటిఫికేషన్ నెంబర్. 1/2026, 3/2026 ప్రకారం ఈ రోజు 18 వ తారీఖున నిర్వహించిన వ్రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల లిస్టులను డిస్టిక్ కోర్టు వెబ్సైట్ www.ecourtskurnool.com మరియు https://kurnool.dcourts.gov.in నందు పొందుపరచడమైనది. ఓరల్ ఇంటర్వ్యూకు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ వెబ్సైట్ నందు తమ పేర్లను చూసుకొని ఈ నెల 20న మధ్యాహ్నం 3-00 గంటలకు జిల్లా న్యాయ సేవా సదన్,కర్నూలు నందు హాజరు కావలసిందిగా కోరడమైనది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి మరియు కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి ఇతర న్యాయమూర్తులు ఆధ్వర్యంలో మరియు ప్రసున్న లా కాలేజీ ప్రిన్సిపల్ శివాజి రావు మరియు టూ టౌన్ సిఐ నాగరాజా రావు వారి సహకారంతో ఈరోజు నిర్వహించిన వ్రాత పరీక్షలు సజావుగా నిర్వహించడమైనది. అలాగే ఉదయం నిర్వహించిన రెండు పరీక్షల గాను ఆదే రోజు మధ్యాహ్నం 04-00 గంటలకు ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల లిస్టును వెబ్సైట్ నందు పొందుపరిచారు.శ్రీ జి. కబర్థి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కర్నూలు, మరియు బి.లీలా వెంకట శేషాద్రి,

