ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ముఖ్యమంత్రి సహాయ ఆర్థిక నిధి నిరుపేదలకు వరం లాంటిదని డోన్ శాసనసభ సభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు.డోన్ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన మొత్తం రూ.15,84,215/-(పదిహేను లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల పదిహేను రూపాయలు) విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొని, లబ్ధిదారులకు స్వయంగా చెక్కులను అందజేశారు. ఈ నిధులు ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత చికిత్సల కోసం మంజూరైనట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,ప్రజల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సాయం అందించడం ప్రభుత్వ బాధ్యత. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఊరట కలిగించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది అని ,ప్రతీ అర్హులైన పౌరుడు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేలా మా కృషి కొనసాగుతుంది. ప్రజల సౌఖ్యం, ఆరోగ్యం, అభివృద్ధి మా ప్రాధాన్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


