విద్యుత్తు దీప కాంతులతో ప్యాపిలి పట్టణం
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: మండల అభివృద్ధిని విద్యుత్ దీప కాంతులతో వెలుగులు నింపే ప్రభుత్వమే కూటమి ప్రభుత్వము అని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం ముఖ్యఅతిథిగా డోన్ శాసనసభ సభ్యులు కోట్ల జయసుధ ప్రకాష్ రెడ్డి హాజరై ప్యాపిలి పట్టణంలో బటర్ఫ్లై ఎల్ఈడి లైట్లు స్విచ్ ఆన్ చేసి ఎల్ఈడి లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిలో ముందు ఉంటూ ప్రజలకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ప్రజల శ్రేయస్సు కోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెదేపా మండల ఇన్చార్జి ఎద్దులదొడ్డి ప్రభాకర్ రెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు ఖాజా ఫీర్, ఎంపీడీవో ఏ శ్రీనివాసరావు, పి ఆర్ ఏ ఈ ప్రభాకర్ రెడ్డి, సీఐ వెంకట్రామిరెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా నారాయణమూర్తి, తెదేపా పట్టణ అధ్యక్షుడు కొంగనపల్లి మధు, మండలాధ్యక్షుడు సుదర్శన్, తెదేపా సీనియర్ నాయకులు గడ్డం ప్రసాద్ రెడ్డి, నడిగడ్డ నాగేంద్ర, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, తెదేపా నాయకులు బత్తుల రమేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గొల్ల రామ్మోహన్ యాదవ్, కృష్ణమూర్తి,ఎస్ కె వలి, కడితం ప్రతాప్ రెడ్డి, పుల్లయ్య, బ్యాంకు శీను, బాలకృష్ణ, సుధాకర్, తదితరులు కూటమి నాయకులు పాల్గొన్నారు.

