NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బియ్యాన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్న హెచ్ఎం ను సస్పెండ్ చేయాలి

1 min read

అవినీతి హెచ్ఎం కు అనుకూలంగా తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఎంఈఓ 2 పై చర్యలు తీసుకోవాలి

పీజీఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ వినతి పత్రం ఇచ్చిన విద్యార్థి సంఘాలు

 కౌతాళం , న్యూస్ నేడు: కర్నూల్ కలెక్టర్ కార్యాలయం లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు కృష్ణ ఉదయ్ రఘు, శేఖర్ ఆఫ్రిది ఖాజా మాట్లాడుతూ కౌతాళం మండల  కేంద్రమైన జడ్పీ స్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సరఫరా చేసే బియ్యాన్ని పేద విద్యార్థుల కడుపు కొట్టి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్న హెచ్ఎం ను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు అన్నారు .ప్రభుత్వం పేద విద్యార్థులకు మంచి ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన చిన్న బియ్యాన్ని సైతం శివరాత్రి సెలవు దినాలలో బియ్యాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నటువంటి హెచ్ఎం ను సస్పెండ్ చేసి అలాగే హెచ్ఎం కు వత్తాసు పలికి అవినీతి హెచ్ఎం కు అనుకూలంగా ఉన్నత విద్యాశాఖ అధికారులకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి ఎంఈఓ 2 కూడా సస్పెండ్ చేయాలని వారు అన్నారు. అలాగే ప్రతిరోజు విద్యార్థులు తక్కువ సంఖ్యలో అన్నం తిన్న ఎక్కువగా హాజరు వేసి అటు ప్రభుత్వాన్ని ఇటు విద్యార్థులను మోసం చేసిన అవినీతి హెచ్ఎం ను సస్పెండ్ చేసేంతవరకు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

About Author