NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జనసేన పార్టీ సభ్యత్వాలపై సమీక్ష..

1 min read

జేఎస్పీ ప్రోగ్రాం నవీన్ రెడ్డి.. ప్రభాకర్

నందికొట్కూరు , న్యూస్​ నేడు:  జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాల నమోదు చేయుట గురించి జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ మెంబర్ వీరం నవీన్ రెడ్డి,జనసేన ప్రభాకర్,కటకం రమేష్ బాబు,ఎస్ఆర్ సతీష్,మారుతి ఫోటో స్టూడియో బాలరాజ్ మరియు కార్యకర్తలతో సోమవారం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా నవీన్ రెడ్డి మరియు ప్రభాకర్ మాట్లాడుతూ ఈనెల 26వ తేదీ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు కార్యక్రమం సందర్భంగా ప్రజలకు వివరించాలని జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది కావునా ప్రతి ఒక్క  జనసైనికుడు తప్పనిసరిగా సభ్యత్వం చేయాలన్నారు.ఆధార్ కార్డు,నామినీ ఆధార్, ఫోటో,మొబైల్ నెంబర్,400 రూ.లు సభ్యత్వం చేయుటకు ఇవి అవసరమని వారు అన్నారు. సభ్యత్వం ఉపయోగాలు:అనుకోని ప్రమాదం జరిగితే ఐదు లక్షలు బీమా..ప్రమాదంలో గాయాలైతే 50 వేల వరకు ఇన్సూరెన్సు క్లెయిమ్,పార్టీ గుర్తింపు కార్డు,పార్టీ సంస్థాగత కమిటీల్లో సభ్యత్వం ఉన్న వారికే ప్రాధాన్యత కల్పించడం జరుగుతూ ఉందని అన్నారు.

About Author