NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీలో వెయ్యి స్టోర్లతో బ‌లోపేత‌మైన అపోలో ఫార్మసీ

1 min read

కర్నూలు,  న్యూస్​ నేడు :  భార‌త‌దేశంలో అతి పెద్ద‌, అత్యంత విశ్వస‌నీయ‌మైన ఫార్మ‌సీ నెట్‌వ‌ర్క్ అయిన అపోలో ఫార్మసీ.. ఆంధ్రప్రదేశ్‌లో త‌న వెయ్యో స్టోర్‌ను ప్రారంభించిన‌ట్లు స‌గ‌ర్వంగా ప్ర‌క‌టించింది. విశాఖ‌ప‌ట్నంలోని ఈ స్టోర్‌ను న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్‌, అద‌న‌పు జిల్లా మేజిస్ట్రేట్ డాక్ట‌ర్ శంఖ‌బ్రత బాగ్చీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అపోలో ఫార్మసీ సీఈఓ పి.జ‌య‌కుమార్, సీఓఓ బాలమురుగ‌న్ కూడా పాల్గొన్నారు.పోలో ఫార్మసీ దుకాణాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని 15 జిల్లాల్లో ఉన్నాయి. వీట‌న్నింటిలో క‌లిపి 7 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు 50 వేల‌కు పైగా నాణ్యమైన మందులు, ఇత‌ర వెల్‌నెస్ ఉత్పత్తుల‌ను ఇది అందిస్తోంది. వీటిలో చాలావ‌ర‌కు స్టోర్లు రోజుకు 24 గంట‌లూ ప‌నిచేస్తాయి. అన్ని జిల్లాల‌కూ మందులు చాలా వేగ‌వంతంగా అందిస్తూ, అత్యవ‌స‌ర‌మైన వైద్య సేవ‌ల‌ను కూడా ప్రతిరోజూ విస్తరిస్తోంది.త‌న సొంత ప్లాట్‌ఫాం అపోలో 24/7 ద్వారా ప్రజ‌ల‌కు కేవ‌లం మందులు అందించ‌డం మాత్రమే కాకుండా.. అపోలో వైద్యుల‌తో టెలిక‌న్సల్టేష‌న్లు, డ‌యాగ్నస్టిక్ సేవ‌లు, క‌స్టమైజ్డ్ బీమా స‌దుపాయాలు కూడా వారి ఇంటి వ‌ద్దనే అపోలో అందిస్తోంది.

About Author