జీతాలు పెంచకపోతే మూల్యం తప్పదు
1 min read

సీఐటియు హెచ్చరిక
రెండో రోజూ కొనసాగిన అంగన్వాడీ దీక్షలు..
నందికొట్కూరు , న్యూస్ నేడు: అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాల జీతాలు పెంచకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి వస్తుందని సిఐటియు జిల్లా నాయకులు గోపాలకృష్ణ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరావు అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో అంగన్వాడి ప్రాజెక్ట్ కార్యాలయం ఎదుట అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు మంగళవారం రెండో రోజూ నిరసన దీక్షలు కొనసాగించారు.కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా గుర్తించి అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షులు మధార్ బి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తి అవుతున్నా వేతనాల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం మోసగిస్తుందని అంగన్వాడీల ఆగ్రహానికి గురికాక ముందే ప్రభుత్వం వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే మార్చి 2న ఛలో విజయవాడ కార్యక్రమానికి అంగన్వాడీలు భారీ ఎత్తున చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ఫర్టిలైజర్ అసోసియేషన్ నాయకులు గౌరీశ్వర్ నాయుడు మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి పక్కిర్ సాహెబ్,అంగన్వాడి ఆయాలు మరియమ్మ,లక్ష్మి, వెంకటలక్ష్మి,అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకులు పద్నావతమ్మ, శైలజ,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

