NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రీ-సర్వే, పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ వేగవంతం చెయ్యాలి

1 min read

వీసీ సమీక్ష ద్వారా ప్రత్యేక సిఎస్ జి.సాయిప్రసాదు, ల్యాండు అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనరు జి.జయలక్ష్మిలకు,జిల్లా ప్రగతిని  జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి వివరించారు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు జిల్లా కలెక్టరు ఛాంబరు నుండి మంగళవారం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పాల్గొన్నారు. జలవనరులు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు ముఖ్యమంత్రికి ఎక్స్- అఫీషియో ప్రత్యేక సిఎస్ జి.సాయి ప్రసాదు, ల్యాండు అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనరు జి.జయలక్ష్మి సంయుక్తంగా  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో భూ హక్కులు ధృవీకరణ, రైతులకు భద్రత కల్పించడం, రీ సర్వే సంబంధిత లోపాలను సరిదిద్దడం లక్ష్యంగా పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లకు వివరించారు.అమరావతి  నుంచి జలవనరులు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు ముఖ్యమంత్రికి ఎక్స్- అఫీషియో ప్రత్యేక సిఎస్ జి.సాయిప్రసాదు, ల్యాండు అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనరు జి.జయలక్ష్మి సంయుక్తంగా మాట్లాడుతూ పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ, రీసర్వే ప్రగతి అంశాలుపై మరింత వేగవంతం చెయ్యాలని, పి జి ఆర్ ఎస్ రెవెన్యూ క్లినిక్లు ముటేషన్లు, ఐవీఆర్ఎస్ సేకరణ రెవెన్యూ డిజిటల్ రికార్డుల రూపకల్పన పురోగతి అంశాలుపై దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ ప్రక్రియను పూర్తి చెయ్యాలని సూచించారు. ఈకేవైసీ పూర్తి చెయ్యాలని ప్రతి రెండు రోజులకు సంబంధించిన ప్రగతి నివేదికలను జిల్లా కలెక్టర్లుకు సూచించారు.వీడియో కాన్ఫరెన్స్ లో  నూజివీడు ఇంచార్జి సబ్ కలెక్టరు, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, కెఆర్ సిసి డిప్యూటీ కలెక్టరు యల్.దేవకీదేవి, జిల్లా సర్వే సహాయ సంచాలకులు అన్సారీ, తదితరులు పాల్గొన్నారు.

About Author