NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ సంక్షేమ పథకాలు రూపకల్పనకు, ప్రణాళికల అమలు కీలకం

1 min read

జనాభా లెక్కలు సేకరణలో పాల్గొనుట అదృష్టంగా భావించాలని మన సర్వీసుకు తీపిగుర్తులు అని, మనస్సుపెట్టి పనిచేసి లక్ష్యాలను అధిగమించాలి

మూడు రోజులు శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని, భారతదేశ జనాభా లెక్కింపు  మొదటి దశకు సంసిద్ధులు కావాలి

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం భారత జనాభా లెక్కింపు- 2027 మొదటి దశలో గృహనిర్మాణ మరియు గృహ గణన జిల్లా మరియు చార్జ్ స్థాయి అధికారులకు 24-02- 2026 నుండి 26-02-2026 వరకు మూడు రోజులు శిక్షణ తరగతులు సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి  అధ్యక్షతన తొలిరోజు శిక్షణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టరుతో పాటు, ఏపీ జనాభా లెక్కలు జాయింటు డైరెక్టరు, నేషనల్ ట్రైనరు జి.వి.చంద్రకళ, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ జనాభా లెక్కింపు-2027 దేశ, రాష్ట్రాలు అభివృద్ధికి ప్రామాణిక డేటాను అందించే అత్యంత ముఖ్యమైన జాతీయ కార్యక్రమo అని, భారతదేశ జనాభా లెక్కింపు -2027 సేకరణలో పాల్గొనుటలో ఒక గొప్ప అదృష్టంగా భవించాలని, భవిషత్తులో తీపిజ్ఞాపకాలుగా ఉంటాయని మనస్సుపెట్టి పనిచేసి  లక్ష్యాలను సాధించాలని అన్నారు. గృహనిర్మాణ మరియు గృహ గణన దశలో సేకరించే వివరాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రూపకల్పనకు, ప్రణాళికలు అమలుకు కీలకమని పేర్కొన్నారు. నేషనల్ ట్రైనరు అందించే శిక్షణలో మార్గదర్శకాలను పూర్తిగా అవగాహన చేసుకుని, ఖచ్చితత్వం మరియు పారదర్శకతతో గణన ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. ప్రతి గృహాన్ని సమగ్రంగా నమోదు చెయ్యడం ద్వారా సరైన మరియు విశ్వసనీయ గణాంకాలు సిద్ధం అమవుతాయని చెప్పార అదనపు ఛార్జ్ అధికారిగా యంపీడివోలు, టెక్నికల్ అసిస్టెంట్లుగా సహాయ గణాంక అధికారి గాని డిజిటల్ అసిస్టెంటు ఉంటారని తెలిపారు. ప్రతి పౌరుడు తన సమాచారంతో పాటు కుటుంబ సమాచారం వివరాలను అందించ వలసిన బాధ్యత  ఉందని అన్నారు. జనగణన ప్రక్రియ దేశానికి అత్యంత కీలకమైనదని, ప్రతి అధికారి కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ఆర్డీవో యం. అచ్యుత అంబరీష్, జెడ్పీ సిఈవో యం.శ్రీహరి, నగర పాలక సంస్థ కమీషనరు ఏ.భాను ప్రతాప్, సంబంధిత జిల్లా అధికారులు,జిల్లా కో-ఆర్డినేటరులు బి.భాగ్యప్ప, అశ్విన్ వాజ్ పేయి, తహశీల్దార్లు, యంపిడివోలు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సహాయ గణాంక అధికారులు, డిజిటల్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

About Author