NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వంకను పూర్తిగా కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకొండి

1 min read

హోళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా అలూరు తాలుక హొళగుంద మండలము హొళగుంద గ్రామంలో వుండు నల్ఫియా మసీదు (బస్టాండ్ మసీదు) వెనుక భాగములో వున్న మైనారిటి యొక్క స్మశాన వాటికకు ఉత్తర దిశన వున్న వర్షపు నీరు పారె వంకపై మీ వంచాయితి వారి యొక్క బంకుల వ్యక్తులు మరియు ప్రవేట్ బంకుల వ్యక్తులు వారి హద్దులు దాటి ఈ వంకపై చొచ్చుకు వచ్చి ఈ వంకను పూర్తిగా కబ్జా చేసి ఈ వంకపై శాశ్విత మరియు తాత్కాలిక అక్రమ కట్టడాలు చేయడం జరిగిందని ఇలా అక్రమ కట్టడాలు చేయడం వల్ల ఈ వంక చెత్తా చెదారంతో మరియు జంతు కళెబారలతో పేరుకు పోయి దాని వల్ల వెలువడే దుర్వాసన వల్ల ముస్లిం మైనారిటీలకు నమాజ్ చేయు సమయంలో చాలా ఇబ్బంది కరంగా మారిందని మరియు భారీ వర్షాలు వడినప్పుడు ఈ వంకలో బ్లాక్ ఏర్పడి ఈ వర్షపు నీరు మైనారిటి యొక్క స్మశాన వాటికలో చేరడం వల్ల చిన్న చెరువును తలపిస్తూందని ఇంతకు ముందు మేము మీ వంచాయితి వారికి అర్జి ఇచ్చినప్పటికి మీరు వీటి పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకొనలేదు. కావున తమరు ఇప్పటికైన ఈ వంక పై మీ పంచాయితి వారి యొక్క బంకుల వ్యక్తుల మరియు ప్రవేట్ బంకుల వ్యక్తుల శాశ్విత మరియు తాత్కాలిక అక్రమ కట్టడాలను క్షుణ్ణంగా పరిశీలించిన వెంటనే మీరు ఈ సమస్యలో ఎలాంటి అలసత్వము వహించకుండ ఈ వంకపై వున్న శాశ్విత మరియు తాత్కాలిక కట్టడాలను తొలగించి మాకు తగు న్యాయము చేయవలచినదిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో జమాతే ఆలే హదీస్ అమీర్ ముల్లా సాదిక్, ముల్లా వలి, ఎస్ ,ఎస్ ,వి, షబ్బీర్, హోళగుందమండల మైనార్టీ అధ్యక్షుడు ముల్లమోయిన్, టైలర్ చికెన్ మా భాష,తన్వీర్, తదితరులు పాల్గొన్నారు.

About Author