ప్రజా నాయకుడు నల్లకన్ను
1 min read

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్
సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ
ఏలూరు, న్యూస్ నేడు: శంకర్ స్వాతంత్ర్య సమరయోధుడు,శతాబ్ద కాలం పాటు ప్రజల కోసం పోరాడిన గొప్ప కమ్యూనిస్టు నాయకుడు,తమిళనాడు సిపిఐ యొక్క అత్యంత ప్రముఖ నాయకులలో కామ్రేడ్ నల్లకన్ను ఒకరని కొనియాడారు.1925 డిసెంబర్ 26 వ తేదీన తమిళనాడు,తూత్తుకుడి జిల్లా,శ్రీ వైకుంఠం నందు వ్యవసాయ కుటుంబంలో మూడవ కుమారుడిగా జన్మించిన నల్లకన్ను 1943లో మదురైలోని హిందూ కాలేజీలో చదువుతుండగా 18 ఏళ్ల వయస్సులోనే కమ్యూనిస్టు భావాల పట్ల ఆకర్షితులై, శ్రీవైకుంఠం బ్రాంచ్‌లో చేరి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని అనేక సార్లు జైలుకు వెళ్లారు.తరువాతి కాలంలో స్థానిక పార్టీ కార్యదర్శి అయ్యారని తెలిపారు.వ్యవసాయ కార్మికుల సంఘ నాయకునిగా వ్యవసాయ కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలను చేసిన గొప్ప నాయకుడు కామ్రేడ్ నల్ల కన్ను అని తెలిపారు.భారత కమ్యూనిస్టు పార్టీ తమిళనాడు రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా 1992 నుంచి 2005 వరకు 13 సంవత్సరాలు పార్టీ కోసం నిబద్ధతగా పని చేసిన గొప్ప కమ్యూనిస్టు నాయకుడని కొనియాడారు. తన జీవితకాలమంతా సామాజిక న్యాయం, భూసంస్కరణలు, కార్మికుల హక్కులు,సాండ్ మైనింగ్ వ్యతిరేక పోరాటాలలో పాల్గొన్న నల్ల కన్ను అద్దె ఇంట్లోనే నివసిస్తూ, ఎటువంటి ఆస్తి సంపాదన లేకుండా ఎప్పుడూ నిరాడంబరమైన సాధారణ జీవితాన్ని గడుపుతూ,ప్రజల కొరకు జీవితాన్ని త్యాగం చేసి ఎంతో మందికి స్పూర్థి కలిగించిన మహోన్నత వ్యక్తి నల్లకన్ను అని తెలిపారు.101 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూయడం కమ్యూనిస్టు పార్టీతో పాటు ప్రజా ఉద్యమాలకు తీరని లోటని,ఆయన మరణానికి చింతిస్తూ,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

