ఉద్యోగ,ఉపాధ్యాయ,పెన్షనర్ల డిమాండ్ల సాధనకై జేఏసీ ఏర్పాటు
1 min read

జేఏసీ నూతన చైర్మన్ చోడగిరి శ్రీనివాస్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఉద్యోగుల సమస్యల పరి ష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కార్యాచరణప్రకటించాలని ఏపీ ఎన్జీజీఓ జేఏసీ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) నూతన చైర్మన్ గా చోడగిరి శ్రీనివాస్, సెక్రటరీ వంగా రామారావును ఏకగ్రీ ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం స్థానిక ఇరిగేషన్ డేటా సెంటర్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో చోడగిరి, ఇతర జెఎసీ నాయకులు మాట్లాడారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవడం వల్లే ఎన్నికల్లో నూతన ప్రభుత్వానికి మద్దతు పలికామ న్నారు. ఇప్పటికీ మూడు డీఏలు ప్రభుత్వం నుంచి బకాయి ఉండగా, జూలైలో నాలుగో డీఏ ప్రకటిం చాల్సి ఉందన్నారు. ఈ సమస్యలను పరిష్కరించ డంలో జరుగుతున్న అతి జాప్యం ఉద్యోగులతో పాటు పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తిని కలిగించిందనిమండిపడ్డారు. కొంతమంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులు పదవీ విరమణ ప్రయోజనాలను పొంద కముందే మరణించారన్నారు. ఉద్యోగుల ఆందోళ నలను పరిగణనలోకి తీసుకుని కూటమి ప్రభుత్వం ఆర్థిక సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించడంపై దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర ఎన్జీఓ సంఘ ఉపాధ్యక్షుడు ఆర్.ఎస్. హరినాథ్,జె ఏ సి నాయకులు పాల్గొన్నారు.

