జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో ప్రతిభ
1 min read

హోలగుంద న్యూస్ నేడు: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హోలగుందకు చెందిన 9వ తరగతి విద్యార్థి మంత్రసాని శివన్న రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో తిరుపతిలోని బాలాజీ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-17 చెస్ టోర్నమెంట్‌లో పాల్గొని, మొత్తం ఆరు మ్యాచ్‌లలో మూడు మ్యాచ్‌లలో విజయం సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు.రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రతిభావంతులైన క్రీడాకారులతో పోటీ పడుతూ శివన్న చూపిన ధైర్యం, ఏకాగ్రత మరియు వ్యూహాత్మక ఆలోచన ప్రతిభావంతమైన క్రీడాకారుడిగా అతనిని నిలబెట్టాయి. ఈ విజయం పాఠశాలకు గౌరవాన్ని తీసుకువచ్చిందని ఉపాధ్యాయులు తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. కబీర్ సాబ్ విద్యార్థిని అభినందించి సర్టిఫికెట్‌ను అందజేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు.పాఠశాల విద్యార్థులు కూడా శివన్న విజయాన్ని ఆనందంగా స్వాగతిస్తూ, అతనిని ఆదర్శంగా తీసుకుని క్రీడలలో ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

