అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
1 min read

న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ పట్టణం కొండ గేరి వీధిలో నివాసం ఉంటున్న సురేష్ భార్య మహాలక్ష్మి 24 సo.లు అనే వివాహిత గురువారం ఉదయం అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. అనారోగ్య కారణాల రీత్యా ఆత్మహత్యాయత్నం చేసుకుందని భర్త, అత్తా,మామలు స్థానిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. కానీ వివాహిత అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భర్త, అత్త,మామలు తమ కూతురిని కొట్టి చంపేశారని మృతురాలి తండ్రి రంగస్వామి తల్లి మల్లేశ్వరమ్మ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉదయం తెల్లవారుజామున భార్యతో సురేష్ గొడవపడి ఆమెను కొట్టినట్లు స్థానికులు చెప్తున్నారు. ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు మృతురాలిని పోస్టుమార్టం కోసం పత్తికొండ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు సిఐ జయన్న తెలిపారు.

