NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విశ్రాంత అసిస్టెంట్ రిజిస్ట్రార్ టి.ఎస్. గణేష్ మరణంపట్ల వీసీ సంతాపం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: రాయలసీమ యూనివర్సిటీ విశ్రాంత అసిస్టెంట్ రిజిస్ట్రార్ టి.ఎస్. గణేష్ మరణంపట్ల రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు సంతాపం ప్రకటించారు వర్సిటీ సెనేట్ హాలులో ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. కర్నూలులోని నాటి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పి.జి. సెంటర్లో 1979లో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన గణేష్ ఇక్కడే కొనసాగుతూ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పి.జి. సెంటర్లోను, అనంతరం రాయలసీమ యూనివర్సిటీలోనూ వివిధ హోదాల్లో సేవలందించారన్నారు. 2010లో వర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా పదవీ విరమణ చేశారన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ఆచార్య బసవరావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయకుమార్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు డాక్టర్ శ్యామలా సరోజిని, తులశమ్మతోపాటు బోధనేతర సిబ్బంది పెద్దసంఖ్యలో పాల్గొని వర్సిటీకి గణేశ్ చేసిన సేవలను స్మరించుకున్నారు.

About Author