3న నీట్ పరీక్షలు..పకడ్బందీగా నిర్వహించాలి
1 min read

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: దేశవ్యాప్తంగా మే 3వ తేదీన నిర్వహించనున్న National Eligibility cum Entrance Test (నీట్–యూజి) పరీక్షలను జిల్లాలో అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి నీట్ యూజి పరీక్షల డైరెక్టర్ జనరల్ ప్రదీప్ సింగ్ కరోలా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, డీఈఓ జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు దివ్యాంగ అభ్యర్థుల కోసం ప్రతి కేంద్రంలో రెండు వీల్‌చైర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అభ్యర్థులు అధిక ఒత్తిడిలో పరీక్ష రాస్తుండటంతో ఇన్విజిలేటర్లు సహానుభూతితో, సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.ఈ సందర్భంగా నీట్ యూజి పరీక్షల డైరెక్టర్ జనరల్ ప్రదీప్ సింగ్ కరోలా మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా నిర్వహణలో నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని, అవసరమైతే ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలను కూడా కేంద్రాలుగా వినియోగించుకోవాలని సూచించారు. కేటాయించిన సామర్థ్యానికి 10 శాతం అదనంగా సీట్లు ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

